Followers

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు

 విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు



విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 

పెన్ పవర్,ఆలమూరు 

  విశాఖ ఉక్కు ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా కొత్తపేట నియోజకవర్గం  ఆలమూరు మండలంలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు,విద్యా సంస్థలు మూసివేశారు. కొత్తూరు సెంటర్ లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. సీపిఐ మండల కార్యదర్శి కే. రామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరోచిత ఆందోళన ఫలితంగా 32 మంది తెలుగు వారి ప్రాణత్యాగాలతో నెలకొల్పబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరి పైనా ఉంది అని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా  కార్పొరేట్  సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ  ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఏ ప్రభుత్వ  సంస్థని మిగల్చకుండా చేయడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తుందని, దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ నాయకులు  వి.శ్యామ్, ఏసురాజు,టీడీపీ నాయకులు వంటిపల్లి సతీష్, నల్లబాబు, రామానుజుల శేషగిరి, వైసీపీ నాయకులు  కొపనాతి శ్రీను, నాతి  కుమార్ రాజా , కాంగ్రెస్ నాయకులు లక్ష్మణరావు,ఏ ఐ వై ఎఫ్ ( AIYF)నాయకులు  ఆనంద్,రవి, ఏ ఐ ఎస్ ఎఫ్ (AISF) నాయకులు రామ్ ప్రసాద్, పరీష్ తదితర విద్యార్థి యువజన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...