Followers

పెదపళ్ల గ్రామంలో వైఎస్సార్ పొలంబడి

 పెదపళ్ల గ్రామంలో వైఎస్సార్ పొలంబడి



వ్యవసాయ శాఖ ఏడీఏ చౌదరి

పెన్ పవర్, పెదపళ్ల 

    ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఆలమూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీఏ సీహెచ్ కేవీ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారిణి (ఏవో) సోమిరెడ్డి లక్ష్మి లావణ్య అన్నారు. ఆలమూరు మండలంలో పెద్దపల్ల  గ్రామంలో డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం ఆలమూరు సహాయ వ్యవసాయ  సంచాలకులు వీహెచ్ కేవీ చౌదరి, ఏవో ఎస్ లక్ష్మి లావణ్య అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యకరమమలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు విధానాలు గురించి వివరించారు. పొలంబడిలో నాలుగు యాజమాన్య సూత్రాలు, పొలం పరిసరాల విశ్లేషణ, బాగస్వామ్య  కార్యాచరణ, పరిశోదనలు వంటివి క్షేత్రస్థాయిలో రైతులతో పొలంలో నిర్వహించారు. అలాగే సుడిదోమ,జీవిత చక్రం దానికి నివారణకు తూటికాడ కాషాయం తయారీ విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి వారం నిర్వహించే ఈ పొలంబడి శిక్షణను రైతులు వినియోగిచుకోవలని తెలియజేశారు. అనంతరం పంట పొలాలను సందర్శించి రైతులతో చర్చలు జరిపి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదపల్ల, గుమ్మిలేరు, సంధిపూడి, మోదుకురు గ్రామా వ్యసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...