తహశీల్దార్ నరసింహమూర్తి టీచర్ ఎం యల్ సి పోలింగ్ కేంద్రం పరిశీలన
తాళ్ళపూడి, పెన్ పవర్మంగళవారం నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు తాళ్ళపూడి తహశీల్దార్ మరియు సహాయ ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ఆధ్వర్యంలో టీచర్ ఎం యల్ సి ఓటింగ్ జరిగే పరస పద్మ రాజారావు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మొదటి ఈ శాన్య గది మరియు టాయిలెట్లు, ఫర్నిచర్, ర్యాంప్, లైటింగ్, హెల్ఫ్ డెస్క్ మొదలగు అన్ని సౌకర్యాలను పరిశీలించి తగు సూచనలు స్కూల్ ఉపాద్యాయులకు ఇవ్వడం జరిగింది. వీరితోపాటు ఎయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు, ఉపాద్యాయులు ఉన్నారు. 14-03-2021 తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ఉపాద్యాయులందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఏ ఎన్నికల గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్న, మా కార్యాలయానికి వచ్చి సహాయ గణాంక అధికారి జోడాల వెంకటేశ్వరరావు ను సంప్రదించమని తెలియజేసారు.
No comments:
Post a Comment