ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి జాగ్రత్త వ్యహించాలి - నరేందర్ సిఐ కీసర
పెన్ పవర్, మల్కాజిగిరి
రాచకొండ సిపి సూచనలు మేరకు కోవిడ్ 19 మహమ్మారిని అరికట్టడానికి మాస్కులు విధిగా ధరించి, శానిటైజర్ ఉపాయోగించి, బౌతిక దూరం పటించాలంటు అవగాహన కార్యక్రమం కీసర పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు. మాస్కులు లేకుండా తీరుగుతున్నా వారికి అవగాహన కల్పించి వారికి మాస్కులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ జన సంచారం గల వివిధ జంక్షన్ల లో మాస్కులు ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించండి. పక్షంలో ఎన్.డి.ఎం చట్టప్రకారం ₹1000 రూ జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కరోనా కోవిడ్ 19 మహమ్మారిని తరిమికొట్టాలని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కీసర సిఐ నరేందర్, ఎస్.ఐ. రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment