Followers

అగనంపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన ప్రధాన ఉపాధ్యాయులు ఎం.కృష్ణా రావును అభినందించిన బలిరెడ్డి సత్యనారాయణ

 అగనంపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన ప్రధాన ఉపాధ్యాయులు ఎం.కృష్ణా రావును అభినందించిన బలిరెడ్డి సత్యనారాయణ


అగనంపూడి, పెన్ పవర్

అగనంపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన ప్రధాన ఉపాధ్యాయులు ఎం కృష్ణా రావును అభినందించిన అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ.హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో లో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అగనంపూడి పునరావాస కాలనీ లో చాలామంది పేదవాళ్ళు తమ పిల్లల్ని చదివిస్తున్నారు అని  క్రమ శిక్షణ ఉత్తమ బోధన తో మంచి ఫలితాలు  తీసుకురావాలని  ఇటీవల 63 లక్షల రూపాయలతో నాడు నేడు కార్యక్రమం లో పాఠశాల అభివృద్ధి చేయడం జరిగిందని మీ విధి నిర్వహణకు ఈ ప్రాంత గ్రామ పెద్దలు విద్యార్థి తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం ఉంటుందని అని అన్నారు.నూతన ప్రధాన ఉపాధ్యాయులు ఎం.కృష్ణారావు మాట్లాడుతూ నేను భీమిలి  మండలం మజ్జి పేట నుండి అగనంపూడి బదిలీ అవ్వడం జరిగిందని స్థానిక పెద్దలు విద్యార్థి తల్లిదండ్రులు సహకారంతో పాఠశాలను ప్రగతి పథంలో నడిపిస్తానని హామీ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ ఈగల చిన్న రమణ, వైఎస్ఆర్సిపి నుండి ఐ ఆర్ సి హెచ్ అప్పారావు,బలిరెడ్డి శ్రీను,తెలుగుదేశం పార్టీ నుండి సింగిడి సింహాచలం, జనసేన పార్టీ నుండి బుదరెడ్డి అప్పారావు ఆర్ఇసిఎస్ విశ్రాంత ఉద్యోగి ఎం నర్సింగరావు మహిళా మండలి నాయకురాలు  దాసరి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...