తాళ్లపూడి మండలశాఖ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం
తాళ్లపూడి, పెన్ పవర్ఆదివారం ఉదయం 9.30 గంటలకి మానవత తాళ్లపూడి మండలశాఖ మార్చి నెల నెలవారీ సమావేశం తాళ్లపూడి బస్టాండ్ వద్ద గల కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కల్యాణ మండపం లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిగా తాళ్లపూడి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జి.రుచిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని అన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవత సంస్థని అభినందించారు. రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న పేదవాళ్ళకి సహాయం చేయడంలో మానవత సంస్థ ముందుంటుందని, ఇంకా ఎక్కువ మంది సంస్థలో జాయిన్ అయి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమం అనంతరం రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్న ప్రక్కిలంక గ్రామానికి చెందిన వ్యక్తి శంకారపు వీర వెంకట శివ శంకర రావు కి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 4,000 అందజేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగభూషణ గుప్త, కోశాధికారి చెరుకు ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, రుక్మాంగధ ఆవాల, సభ్యులు డెంటిస్ట్ గోళ్ళ సాగర్, ఈసి మెంబర్స్ జంగా లక్ష్మీపతి, గంధం మునేశ్వరరావు, ఇంజరపు వెంకట కృష్ణ సత్యనారాయణ, సీనియర్ సభ్యులు గెడ్డం సాయిబాబా, కొత్త సత్యనారాయణ, ఇతర సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment