బాధితులకు అండగా ఎమ్మెల్యే వెన్నెల చేతుల మీదుగా.. నిత్యావసరాలు పంపిణీ
బొండపల్లి, పెన్ పవర్
మండలంలోని దేవుపల్లి పంచాయితీ కొండవాని పాలెం లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులకి ట్రిపుల్ ఈ సర్వీసెస్ సంస్థ అధినేత వెన్నెల చంద్ర శేఖర్ అండగా నిలిచారు. అగ్ని ప్రమాదంలో 40 కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ కుటుంబలన్నింటికీ నిత్యావసరాలను అందించడానికి ముందుకు వచ్చారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య చేతుల మీదుగా శనివారం ఒక్కో బాధిత కుటుంబానికి వస్త్రాలు, దుప్పట్లు, బియ్యం బస్తాలు తదితర నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పల నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మానవత్వంతో తన వంతు సాయం అందించడంలో వెన్నెల చంద్రశేఖర్ ముందుంటారని ఎమ్మెల్యే అభినందించారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో విశేషమైన సేవలందించిన చంద్ర శేఖర్ అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment