Followers

జాబ్ మేళలో ప్రతి ఒక్కరికి అవకాశం

 జాబ్ మేళలో ప్రతి ఒక్కరికి అవకాశం..

ఏప్రిల్ 7న సెట్విన్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా..

30 ప్రధాన ప్రయివేటు రంగ సంస్థలు భాగస్వామ్యంతో మేళా..

పట్ట భద్రులు,మొదలుకొని సాధారణ విద్యార్హతలు,ఏవిద్యార్హతలు లేని వారికీ అవకాశం..

లష్కర్ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని..ఉప సభాపతి పద్మారావు గౌడ్..

తార్నాక, పెన్ పవర్

జంటనగరాల నిరుద్యోగ యువతీ యువకులకు సితాఫలమండీ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏప్రిల్ 7న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సెట్విన్ సంస్థ అద్వర్యంలో 30 ప్రధాన ప్రయివేటు రంగ సంస్థలు భాగస్వామ్యం అయ్యే ఈ మెగా జాబ్ మేళా లో కనీసం రెండు వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. శనివారం సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఇతర అధికారులు, కార్పరేటర్లు, నాయకులతో కలిసి అయన మెగా జాబు మేళా కర దీపికను సితఫలమండీ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సైతం సికింద్రాబాద్ ప్రాంతంలో వివిధ ప్రదేశాల్లో సెట్విన్ సంస్థ సహకారంతో జాబ్ మేళాలు నిర్వహించమని శ్రీ పద్మారావు గౌడ్ తెలిపారు. సెట్విన్ ఎండీ  శ్రీ వేణు గోపాల్ మాట్లాడుతూ పట్ట భద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు మొదలుకొని సాధారణ విద్యార్హతలు, ఏ విద్యార్హతలు లేని వారికీ సైతం ఆయా అర్హతల ఆధారంగా వివిధ ఉద్యోగాలను అందించేలా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. తీగుల్ల పద్మారావు గౌడ్ జన్మ దినాన్ని పురస్కరించోకొని సికింద్రాబాద్ కు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాన్ని అందించేందుకు ఏప్రిల్ 7 వ తేదిన భారీ స్థాయిలో జాబు మేళాను నిర్వహించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని, కేవలం సికింద్రాబాద్ స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కుడా సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...