పట్టభద్రులు అభివృద్ధిలో భాగస్వామ్యులు అవ్వాలి..
కుత్బుల్లాపూర్/పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు పరిధి గంగస్థాన్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మార్నింగ్ వాకర్స్, పట్టభద్రులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. బ్యాలెట్ పేపర్లో నాలుగో నంబర్ వద్ద వాణీదేవికి ఎదురుగా ఒకటి నంబర్ వేసి ఓటు వేయాలని బ్యాలెట్ పేపర్‌ను ఓటర్లకు చూపించారు.
వాణీదేవిని గెలిపిస్తే విద్యావంతురాలైన ఆమె పట్టభద్రుల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, దూలపల్లి పిఎసిఎస్ చైర్మన్ నరేందర్ రాజు, కౌన్సిలర్లు లక్ష్మీ దేవేందర్, రవీందర్ యాదవ్, డప్పు కిరణ్ కుమార్, సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంత రావు, దేవేందర్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బూర్గుబావి సత్యనారాయణ, మధు సుధన్ యాదవ్, నాయకులు మోహన్ రావు, వెంకటేష్, జి.రాకేష్, జి.వెంకటేష్, జి.సతీష్, సాయి గౌడ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment