Followers

గిరిజనులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది

 గిరిజనులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది

అరకు, పెన్ పవర్

గిరిజనులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది అని పిసిసి ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి అన్నారు.అరకువేలి 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో స్త్రీ వైద్య నిపుణులు లేనందున నలుగురు గర్భిణీ స్త్రీలు ఆటోలో సుమారు 50 కి.మీటర్ పాడేరు హాస్పిటల్ కు  చికిత్సకు వెళుతున్న సమయంలో సంతరి జంక్షన్ దగ్గర ఆటో యాక్సిడెంట్ జరిగింది నలుగురు గర్భిణులుకు గాయాలు అయ్యాయి గర్భిణీ స్త్రీలకు చెకప్ కి తీసుకు వెళుతున్న  ఎస్.లైచోన్ కు తీవ్రంగా గాయపడ్డారు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అని ఆమె అన్నారు. స్థానికులు సహాయంతో హుకుంపేట హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం పాడేరు హాస్పిటల్ కు తరలించారు.అరకువేలి మండలం చినలబుడు పంచాయతీకి చెందిన చినలబుడు,కరయిగూడ, తురాయి గూడ గ్రామానికి చెందిన గిరిజన గర్భిణులు అరకువేలి నుండి పాడేరు హోటల్ లో వెళ్తున్న సమయంలో పెదగరువు,కోటనపల్లి మధ్య సంతరీ జంక్షన్ వద్ద ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో  యాక్సిడెంట్ జరిగింది.గర్భిణీ స్త్రీలు నెలసరి వైద్యం కొరకు కు వెళుతున్న వారు .బి.మాలతి వయసు ( 25) 7 నెలలు కడుపులో  దెబ్బతగిలింది.పి.హిందు వయస్సు (20) 6 నెలలు ఎస్.సీత వయసు( 22) 6 నెలలుపొత్తంగి ధనకుమారి వయస్సు ( 21) 5 నెలలు గర్భిణులకు చిన్న చిన్న దెబ్బలు తగిలయి విరితో పాటు ఎస్.లైచోన్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి.అరకువేలి ప్రభుత్వ హాస్పిటల్ లో గర్భిణులకు వైద్య నిపుణులు లేనందున,ఈ సమయంలో ప్రభుత్వ అంబులెన్స్ కూడా లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనం ఆటో మాట్లాడుకుని అరకువేలి నుండి పాడేరు హాస్పిటల్ లో 50.కి. మీ దూరం వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు ఆటో ప్రమాదానికి గురైంది.అరకువేలి నుండి పాడేరు హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న గర్భిణులకు కనీసం అంబులెన్స్ కుడా ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రభుత్వ హాస్పటల్ లో మెరుగైన వైద్యం అందించడానికి  స్త్రీ వైద్య నిపుణులు  ఏర్పాటు చేయాలని గర్భిణీ స్త్రీలు, తోపాటు చిన్నారులకు వృద్ధులకు ఇతరులు కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే అంబులెన్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...