Followers

ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి

 ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి:మేడ్చల్ కలెక్టర్..


మేడ్చల్ ,పెన్ పవర్

ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదనపు ప్రిసైడింగ్ ,అధికారులకు ర్యాండమైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశామని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌  పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ఈనెల 14న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గురువారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించి 934 మందికి సెకండ్ ర్యాండమైజేషన్ నిర్వహించామని తెలిపారు.. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 198 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... మొత్తం 1,31,000 మంది ఓటర్లు ఉన్నారని దీనికి సంబంధించి ఆయా కేంద్రాల్లో ఎన్నికలు కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. అలాగే కొన్ని చోట్ల ఏమైనా పనులు ఉంటే వాటిని సైతం పూర్తి చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ఇప్పటికే ఆయా ఎన్నికల కేంద్రాల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు,  విద్యాసాగర్, డి ఆర్ ఓ .లింగ్య నాయక్ , ఏ ఓ .వెంకటేశ్వరులు    తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...