కండల వీరుడు శివాజీకి ప్రసంశల జల్లు
పెన్ పవర్,వరదయ్యపాలెంహైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నరేష్ సూర్య క్లాసిక్ సంస్థ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బాడీ బిల్డర్ లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంకు చెందిన అక్షిం పాలెం గ్రామం నుండి పెట్టి శివాజీ పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.80 కిలోల విభాగంలో ఈ బహుమతి చేజిక్కించుకున్నారు.దాతలు ముందుకు వచ్చి మరింత సహాయ సహకారాలు అందించిన ఎడల లక్నోలో జరగబోవు జాతీయ స్థాయి పోటీలలో,ఏప్రిల్ లో జరగబోవు మిస్టర్ ఇండియా పోటీలలో కూడా పాల్గొని బహుమతి సాధించగలను అని శివాజీ తెలిపారు.మారుమూల గ్రామం నుండి ఎదిగి, తమ ఊరికి పేరుప్రఖ్యాతులు తీసుకు వస్తున్న శివాజీని అందరూ అభినందించి ప్రశంసలతో ముంచెత్తారు.
No comments:
Post a Comment