జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతం
ఏజెన్సీలో వినూత్న రీతిలో గిరిజన సంఘాల నిరసనలుమావోయిస్టులు బంద్ కు మద్దతు ఇవ్వడంతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం
పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు పిలుపుమేరకు శుక్రవారం చేపట్టిన భారత్ బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. వివిధ కాసర్మిక సంఘాలు ఆందోళనలో చేపట్టి నిరసనలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంఘాలు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ బంద్ పాటించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చేపట్టిన భారత్ బంద్ కు మావోయిస్టులు కూడా మద్దతు తెలపడంతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ ఓ బి పరిధిలో జరుగుతున్న బంధువుల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని పోలీస్ బలగాలు మోహరించాయి. ముంచింగిపుట్టు పెదబయలు చింతపల్లి కొయ్యూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
డివిజన్ కేంద్రమైన పాడేరులో సిపిఎం గిరిజన సంఘాల నాయకులు రోడ్లపై వాలీబాల్ ఆడుతూ నిరసన తెలిపారు. పెదబయలు మండలం లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పెరుగుతున్న గ్యాస్ ఆయిల్ నిత్యవసర ధరలను తగ్గించాలని వినతి పత్రాన్ని గోమాతకు ఇచ్చి వినూత్నంగా ఆందోళన చేశారు. అరకు ముంచంగిపుట్టు మండలంలో రోడ్లపై వంటావార్పు చేసి రోడ్ల పైనే తింటూ నిరసన తెలిపారు. కారుకి తాడు కట్టి లాగుతూ బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పెట్రోల్ డీజిల్ ధర మండిపోతుంది సాయన్న పెట్టండి అంటూ నినాదాలు చేయడం విశేషం. ఏజెన్సీ 11 మండలాల్లో భారత్ బంద్ విజయవంతంగా జరిగింది అని చెప్పవచ్చు. దుకాణాలు హోటల్లో మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో ప్రైవేటు వాహనాలు కూడా ఆపివేశారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన భారత్ బంద్ మైదాన మరియు గిరిజన ప్రాంతంలో వకూడా సక్సెస్ అ సయింది.
No comments:
Post a Comment