నారాయుడు పాలెం లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి
మునగపాక,పెన్ పవర్
మండలం లో నారాయడు పాలెం గ్రామం నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావు దాడిచేసి గ్రామానికి చెందిన కల్లు అప్పారావు దగ్గర నుండి 10 లీటర్లు సారా 100 లీటర్లు పులుపు స్వాధీనం చేసుకున్నారు.చిన్నోడు పాలెం గ్రామానికి చెందిన చిన్ని సూర్యనారాయణ దగ్గర 10 లీటర్లు సారా 200 లీటర్ల పులుపు ను సిబ్బంది తో కలిసి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలియజేసారు.
No comments:
Post a Comment