హరిహర దేవస్థానంలో సీసీ కెమెరాలు ప్రారంభం
మందమర్రి, పెన్ పవర్
మందమర్రి పట్టణంలోని హరిహర దేవస్థానంలో సీసీ కెమెరాలను శుక్రవారం మందమర్రి పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్, గోవర్ధనగిరి అనంతచార్యులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీసీ కెమెరాలతో నేరాల నియంత్రించవచ్చని పేర్కొన్నారు. బుధవారం దేవస్థానంలో దొంగతనం జరిగిన వేల రూపాయల దేవుని సామాగ్రి అపహరణకు గురి కావడంతో ఆలయ కమిటీ సభ్యులు చందాలు పోగుచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎనిమిది కెమెరాలతో ఆలయ ప్రాంగణం, అన్నదాన సత్రంతో సహా దేవస్థానం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు దామోదర్ ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment