సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి
చిన్నగూడూరు,పెన్ పవర్
స్థానిక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా తెరాస నాయకులు సోమవారం నాడు ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నుండి నిరుద్యోగులకు లక్షకుపైగా ఉద్యోగాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, ఇంకా రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూల మురళీధర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, తెరాస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, చెన్నారెడ్డి, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు మన్నె చెన్నయ్య, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు దొంగరి నరసయ్య, దేశగాని రమేష్, వీరాచార, సిహెచ్ ప్రవీణ్, మూల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment