కన్నుల పండుగగా మన్నెంకోండ జాతర
మోతుగూడెం,పెన్ పవర్
సంస్కృతీ సంప్రదాయాలకు గౌరవం ఇచ్చే మన దేశంలో గిరిజన జాతరలు కూడా ఘనంగా నిర్వహిస్తారు,అలాంటి జాతరలలో ఒకటి మన్నెంకోండ జాతర, ఈ గిరిజన జాతరను ఒరిస్సా రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రభుత్వ లాంఛనాలతొ నిర్వహింస్తున్నారంటే అ జాతర విశిష్టత అలాంటిది ఈ జాతరకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలకు నిలయంగా పోల్లురు జలపాతం ఉన్నాది. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్ గిరిలో కొలువై ఉన్న గిరిజన వనదేవతలు కన్నమరాజు,బాలరాజు, పోతురాజుల సహిత ముత్యాలమ్మ తల్లిని అరుపంగా (రుపంలేకుండా ఉండటం)ఉండే అమ్మవారి ఘట్టం అమ్మవారి సోదరులు (జెండా)రుపాలలో పుజాలు అందుకుంటారు, వీరికి ముడు సంవత్సరలకు ఒక సారి వాటిని నిర్వీర్యం చేసి వాటి స్థానంలో కొత్తవాటిని తీసుకోని వాటిలో ప్రాణ ప్రతిష్ట చేస్తారు, దీనినే మన్నెంకోండ జాతరగా జరుపుకొంటారు ఈ జాతర ముఖ్య మైన ఘట్టాలు మంగళ స్నానం, ప్రాణప్రతిష్ఠలు మన రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం గ్రామానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోల్లురు జలపాతం వద్ద జరుగుతుంది, ఈ జాతరను రెండు రాష్ట్ర ప్రభుత్వ ఆధికారుల సమక్షంలో సోమవారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చింతూరు ఐటీడీఏ పీవో అకుల వెంకటరమణ హజరైనారు, భక్తులు సీలేరు నది దాటుటకు నాలుగు పడవలను ఏర్పాటు చేశారు.
పడవలు దాటే సమయంలో ఎన్ డి అర్ ఎప్ బృందలు పర్యవేక్షించాయి అక్కడ నుండి జలపాతం వద్దకు చెరుకునే దాక ఎటువంటి అవంచనియ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు బందోబస్తు ఏర్పాటు చేశారు,ఆరోగ్య శాఖ వారు పోల్లురు మరియు జలపాతం వద్ద వచ్చే భక్తుల కోసం ఒఆర్ఎస్ పాకెట్ల పంపిని చేశారు ఎవరికైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటే తక్షణం స్పందించేందుకు వైద్య ఆధికారులు మరియు అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు, వచ్చిన భక్తుల కోసం అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ద్వారా ఐదు వేల మందికి పులిహోర పోట్లలను అందించారు, మోతుగూడెం మరియు పోల్లురు గ్రామలకు చెందిన యువకులు దాతల సహకారంతో బోజన ఏర్పాట్లు మరియు కాలి నడకన వచ్చే వారికి మార్గ మధ్యలో మజ్జిగ మరియు మంచి నీటి పాకెట్ లను అందించారు, ఈ జాతర మహోత్సవనికి ఒరిస్సా ,చత్తీస్గఢ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లకు చెందిన సుమారు పదివేల మంది ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment