Followers

పురపీఠం వైయస్సార్ కాంగ్రెస్ దే ...

పురపీఠం వైయస్సార్ కాంగ్రెస్ దే ...



నర్సీపట్నం, పెన్ పవర్ 

  మున్సిపాలిటీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి, వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 25, 26 వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. అబీద్  సెంటర్ లో సీనియర్ వైసీపీ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, 25 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని దేవత అరుణ, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. నూకాలమ్మ ఆలయంలో సీతారాముల ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయ్యరక వీధి, మేదరవీధి, కోమటివీధి,  తోట వారి వీధి, వెలంపేటలో ప్రచారం నిర్వహించారు.  మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. కౌన్సిలర్ అభ్యర్థి భర్త దేవత కామేశ్వరరావు ఏర్పాటు చేసిన పార్టీ రంగులతో కూడిన బెలూన్లు, పార్టీ సింబల్  ఫ్యాన్లు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గడప గడప లో మహిళలను పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధి జరగాలంటే దేవత అరుణను గెలిపించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో 26 వ వార్డు అభ్యర్థి రుత్తల శ్రీనివాసరావు ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు. అక్కడ ఎమ్మెల్యే కొద్దిసేపు కాంగో ప్లే చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ నుండి 26 వ వార్డులో లగుడు వారి వీధి, వెలంపేట, గచ్చపు వీధుల్లో ప్రచారం చేశారు.  వార్డులను అభివృద్ధి చేసే అవకాశం  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఉందని, 26 వార్డ్ లో రుత్తల శ్రీనివాసరావు ను గెలిపించండని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు.  మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు.  ఎన్నికల హామీలో భాగంగా మున్సిపాలిటీలో 25% ఆస్తిపన్ను తగ్గించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  మున్సిపాలిటీలో అందరి దృష్టి 25, 26 వార్డ్ లపైనే ఉందని,  రెండు వార్డులలో వైసిపి అభ్యర్థులను గెలిపించి ప్రత్యర్థుల నోళ్ళు మూయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు చింతకాయల వరుణ్, దేవత కామేశ్వరరావు,  స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి కనకమహాలక్ష్మి, కర్రి శ్రీనివాసరావు, రాంగోపాల్ , మీసాల సత్యనారాయణ ధనిమిరెడ్డి నాగు, ఏకా రాజబాబు, ధనిమిరెడ్డి ప్రసాద్,  లాలం చినఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...