Followers

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ

 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ

విశాఖపట్నం,పెన్ పవర్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని,ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అల్లిపురం నాలుగు రోడ్ల జంక్షన్ లో రాస్తా రోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తూనే తాజాగా వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్ణయాన్ని ఆడ్డుకోవాల్సిన రాష్ట్ర అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు గోరంగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ మరో పక్క జనసేన పార్టీ నాయకత్వం కూడా బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. రేపు జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో పై పార్టీల వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయలేని వారు ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు జి కాసులరెడ్డి, స్థానిక నాయకులు చామన విశ్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...