కాగజ్ నగర్ లో రాజా సింగ్ దిష్టిబొమ్మను దహనం
మంచిర్యాల బ్యూరో, పెన్ పవర్
దళితులను అవమానపరిచి దళితుల ముస్లిమ్ ల ఆహార వ్యవహారపై అనుచిత వాఖ్యలు చేసిన రాజాసింగ్ శాషన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రావణ్ ఆధ్వర్యంలో లో కాగజ్ నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం చేశారు.
రాయడానికి వీలు లేని బూతులు తిట్టడాన్ని భీం ఆర్మీ తీవ్రంగా ఖదిస్తుందని, ఒక వైపు దళితులను కన్న తల్లులని తిడుతూ మరో వైపు భారత మాతకు జై అంటున్న రాజసింగ్ దొంగయని, దొంగ దేశ భక్తిని ప్రద ర్షిస్తున్నడు ఆవు పేరుతో దైవ భక్తి కూడా వట్టిదే దాని వెనుక దళితులు మైనార్టీల పై దాడులు చేయాలనే కుట్ర ఉందని పోలీసుల నిర్లక్ష్యంతో నే రాజసింగ్ రెచ్చిపోతున్నాడన్నారు. పరుష పదజాలంతో వ్యాఖ్యాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేవ్యాఖ్యలు రాజసింగ్ కు పరిపాటిగా మారిందని, రాజ్యాంగాన్ని ,దళితులను కించపరిచిన రాహసింగ్ పట్ల పోలీస్ లు ఉపెక్షి స్తే సహించేది లేదని భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రావణ్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో భరత్,మదాస్ నగేష్,ఇప్పా రవిశంకర్,దిలీప్,నక్క ప్రభాకర్,శ్రీను తదతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment