బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేరు
జగన్ మోహన్ రెడ్డి పంపిన ఇద్దరు చెంచాలు తమ ఇంటికి వచ్చి మా నాన్న ని బెదిరించారురాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి అనర్హుడు
విశాఖ ఉక్కు యూనియన్ నాయకులు కొందరు అమ్ముడు పోయారు
మహారాణి పేట, పెన్ పవర్
ఆంధ్ర రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. శనివారం వీజేఏఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ మరి కొన్ని రోజులలో మార్చి నెల ముగుస్తున్నా ఇంకా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లో అరాచకం కొన సాగుతోందన్నారు.రాయలసీమ వారికి ఒక సంస్కృతి ఉందని "ఎంతటి వైరం వున్నా పరస్పరం తల తలపడతారు గాని కుటుంబాల జోలికి వెళ్ళరని కానీ జగన్ మోహన్ రెడ్డి పంపిన ఇద్దరు చెంచాలు వచ్చి తమ ఇంటికి వచ్చి మా నాన్న ని బెదిరించారన్నారు. ఫలితంగా ఆయన గుండెపోటుకు గురై ఆస్పత్రి పాలయ్యారన్నారు.ఆ వచ్చిన వారెవరో తెలియజేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశాన"ని పేర్కొన్నారు. రాయలసీమ సంస్కృతి లేని రెడ్డి కాని రెడ్డి తో పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉందన్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.జగన్ బెయిల్ రద్దు అయితే రాష్ట్ర పరిస్థితి ఏమిటన్నారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రనికి ముఖ్య మంత్రిగా లేరన్నారు.
వెంటనే ఆయన రాజీనామా చేసి క్లీన్ చిట్ వచ్చిన తరువాత ఎన్నికలలో పోటీ చేయాలన్నారు.బెదిరించి ఓట్లు వేసుకొని స్థానిక ఎన్నికలలో గెలుపుపొందారన్నారు. భయ పెట్టి ఎంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు యూనియన్ నాయకులు కొందరు అమ్ముడు పోయారని, త్వరలోనే వారందరి పేర్లు బయటపెడతానని తెలిపారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన పై తాను వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి మరోసారి రాష్ట్రపతి,ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తనపై దాడి జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తప్పు పట్టారన్నారు. ఈ పరిసతిలో విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఉండేందుకు అనర్హులన్నారు.విలేకర్ల సమావేశంలో కే.కార్తీక్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment