Followers

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

 పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి

లక్షెట్టిపెట్, పెన్ పవర్

సరైన పోషకాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసిడీఎస్ సూపర్వైజర్ జ్యోతి అన్నారు.శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల ఒకటవ సెంటర్ లో గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రల ద్వారా పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు.గర్భిణులు ఎక్కువగా ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు, కడుపులో ఉన్న బిడ్డకు కూడా సరిపడా ఆహారం అందిచాలని,అదే విధంగా గర్భిణులు ఎలాంటి మానసిక ఇబ్బందులకు గురికావద్దని,పాలు ఆకు కూరలు గుడ్లు  ఎక్కువగా తీసుకోవాలని అందులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నారు.చిన్నారుల్లో వయసుకు తగిన బరువు,ఎత్తులో తేడాలు అనిపిస్తే వెంటనే అంగన్వాడీ సెంటర్ కు తీసుకురావాలని తెలిపారు. అనంతరం పోషకాహారం లోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శాంతకుమారి ఎఎన్ఎం విజయదర్శిని, ఆశ కార్యకర్త విజయ, వివో లీడర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...