మోడీ కేసీఆర్ లు తోడు దొంగలు: రేవంత్ రెడ్డి
కూకట్ పల్లి,పెన్ పవర్
కేసీఆర్ ది కల్వకుంట్ల కుటుంబం కాదు నల్లికుంటల కుటుంబం అని మల్కాజిగిరి ఎం.పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోదీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆసియాలో లొనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుండి గెలిపించి గల్లీ నుండి ఢిల్లీ కి పంపించడం లో యువత పాత్ర ఎంతో కీలకమైనదని, మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేశారని అంటున్న తెరాస పార్టీ జి.ఎస్.టి బిల్లుకి మరియు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరికొన్ని బిల్లులకు ఎందుకు మద్దతు ఇచ్చారు అని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలే అనీ రైల్వే కోచ్, తెలంగాణకు రావాల్సిన ఐ.టి.ఐ.ఆర్ రాలేదు అంటున్న కేటీఆర్ కి సూటిగా సవాల్ విసురుతున్నామని ఇద్దరం ఢిల్లీకి కలిసి వెళ్లి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చి అయినా సరే సాధించుకోవడానికి వస్తావా అని సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ తరుపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మిగిలిన నాయకులను ఒప్పిస్తాం. పార్లమెంట్ లో తమతో కలిసి కొట్లాడడానికి రావాలి అని సూచించారు. నువ్వు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే ఇంకా లక్ష ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అన్నారు.
2013 పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని బీజేపీ వారు పూర్తి చేసారా అని విమర్శించారు. ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ ఓడితే కేసీఆర్ కుర్చీకి వచ్చిన అపాయం ఏమి లేదనీ, కెసిఆర్ కి తన కూతురు, కొడుకు వల్లే అపాయం ఉందనీ,యువత, విద్యార్థులు, విద్యావంతులు అందరూ కలిసి ప్రశ్నించే గొంతుక అయిన చిన్నారెడ్డి ని గెలిపించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం, రాఘవేందర్, కూకట్ పల్లి డివిజన్లకు చెందిన ప్రెసిడెంట్లు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment