భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలి...
అదిలాబాద్, పెన్ పవర్అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం వంచిత్ బహుజన అఘాడి పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంచిత్ బహుజన ఆఘాడి పార్టీ అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి గుల్వే పంచశీల్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు ప్రఖ్యాత విప్లవకారుడు భగత్ సింగ్ 28 సెప్టెంబరు1907 నాడు జన్మించారని -23 మార్చి 1931నాడు మరణించారని ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడని విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే అని,భారత స్వాతంత్ర్యోద్యమములో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడని ఆయన దేశానికి చేసిన సేవలు మరవలెనివని అన్నారు. ఈ కార్యక్రమంలో వంచిత్ బహుజన అఘాడి పార్టీ బోథ్ నియోజక వర్గ ఇంచార్జి సందీప్, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ సూర్యవంశీ,పార్టీ కార్యకర్తలు జావిద్ దీపంకర్,రాహుల్,మారుతి,అనిల్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment