Followers

బోధనాభ్యాసన పరికరాలు తరగతి గదికి గొప్ప ఆభరణాలు

 బోధనాభ్యాసన పరికరాలు తరగతి గదికి గొప్ప ఆభరణాలు 

సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి

బెల్లంపల్లి , పెన్ పవర్

పట్టణంలోని సిఓఈ గురుకులం లో సృజనాత్మకంగా బోధనాభ్యాసన పరికరాల ప్రదర్శన సాగింది. తరగతి గదిలో ఉపాధ్యాయుల పాఠ్యభోధనకు బోధనాభ్యాసన పరికరాలు గొప్ప ఆభరణాలని ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి అన్నారు.సోమవారం  తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ లో జరిగిన ఆదిలాబాద్ రీజియన్ స్థాయి తెలుగు బోధనాభ్యసన పరికరాల ప్రధర్శన ముఖ్య అథిధిగా హాజరయ్యారు.  ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రధర్శనను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తరగతిగదిలో ఉపాధ్యాయులు తమ స్రుజనాత్మకతను ఉపయోగించి బోధనభ్యస పరికరాలు చేయడం పిల్లల్లో ఆసక్తిని పెంపొందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఅర్సీఓ కోటిచింతల మహేశ్వర రావు,బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు,బాలికల ప్రిన్సిపాల్  యస్.స్వరూప రాణి, కాసిపేట ప్రిన్సిపాల్ ,కో ఆర్డినేటర్లు కోటరాజ్ కుమార్,తదితరులుపాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...