సరసమైన ధరలకే పేదప్రజలకు సరుకులు ఇవ్వాలి..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్గాజుల రామారం డివిజన్ పరిధిలోని బాలయ్య నగర్ లో భావన కిరణ జనరల్ స్టోర్స్ ను ప్రారంభించిన భాజపా నాయకులు కెకెఏం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్.. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సరసమైన ధరలకే పేద ప్రజలకు కిరాణా సరుకులు అందివ్వాలని, నాణ్యతతో కూడిన వస్తువులను వినియోగదారులకు అందజేయాలని సూచించారు.. ఈ వ్యాపారం లో మంచి లాభాలు సాధించాలని కోరుకుంటున్నట్టు కూన శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళి గౌడ్, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment