వనపర్తిలో ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవం
వనపర్తి, పెన్ పవర్
టి ఎస్ ఆర్ టి సి వనపర్తి డిపో లో ఇంచార్జ్ డిపో మేనేజర్ కె.వి రాజశేఖర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగస్తులకు క్రీడా పోటీలు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, బెలూన్ గేమ్స్ నిర్వహించారు. కేకు కట్ చేసి, భోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ వి. దివ్య తేజ, డాక్టర్ జి. సుధీంద్ర పాల్గొన్నారు. మహిళ ఉద్యోగినులను సన్మానించారు, క్రీడలలో గెలుపొందిన ఉద్యోగినులకు అవార్డులు ఇచారు. ఈ కార్యక్రమంలో శ్రీలత (ఎస్.టి.ఐ), ఫాతిమా బేగం (సీనియర్ అసిస్టెంట్), రాజేష్ (ఏడీసీ), రవీందర్ (ఎడిసి), విమలమ్మ, అరుణమ్మ, ప్రభ రాణి, వనజ, భాగ్యలక్ష్మి, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment