వి.ఆర్.పురం మండలంలో భారత బంద్ విజయవంతం
వి.ఆర్.పురం,పెన్ పవర్వి.ఆర్.పురం మండలం రేఖపల్లి జంక్షన్ లో టిడిపి, సిపిఎం, పార్టీ నాయకులు ప్రజా సంఘాలు శుక్రవారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మండలంలోని వ్యాపారస్తులు హోటల్ యాజమాన్యం మండల ప్రజలు భారత బంద్ కు సంఘీభావం తెలిపినారు. రహదారులపై జనం లేకపోవడంతో రోడ్లు ఖాళీగా మారాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కారం సి రామయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. రైతు వ్యతిరేక చట్టాల విద్యుత్ బిల్లు రద్దు చేయాలి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువులు తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు పాయంరామారావు పూనెం సత్యనారాయణ బోప్పిన కిరణ్ర్. గుండెపూడి లక్ష్మణరావు సత్తిబాబు సోయం చిన్నబాబు ప్రకాష్ రావు శ్రీరామ్ మూర్తి సారయ్య కన్నారావు మల్లయ్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment