ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో
పెన్ పవర్ ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం మండల కార్యాలయం నందు ఈరోజు నిర్వహించిన ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపిడిఓ నాతి బుజ్జి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ఉపాధి హామీ పనులు జరగాలని కొత్త పనులు గుర్తించి ఆ గ్రామాల్లో ఉపాధి నెలకొనేలా పనులను చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగినది అలాగే వేతనదారులు సంఖ్య పెంచాలని ఉపాధి హామీ పనులు గుర్తించినప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆ గ్రామాలలో పంట పొలాలకు నీరు వెళ్లే కాలువలు కూడా గుర్తించి రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆమె సూచించడం జరిగింది ఈ సమావేశంలో మండలంలో ఉన్న ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment