95 వార్డులో గవరపాలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అదీప్ రాజు,వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు
పెందుర్తి, పెన్ పవర్
శనివారం ఉదయం ఎమ్మెల్యే అదీప్ రాజు,95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, జోనల్ కమీషనర్, ఏ.ఎమ్.హెచ్.ఓ, లక్ష్మి తులసి మరియు ఇతర అధికారులతో కలిసి 95 వార్డు గవరపాలెం గ్రామం సందర్శించారు గ్రామం లో గల ప్రతి వీధి తిరిగి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసు కున్నారు.అలాగే గ్రామం లో ప్రతి ఒకరికి సంక్షేమ పథకాలు అందేలాగ చూడాలని సూచించారు. అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ భవిష్యత్తులోఆ గ్రామానికి కావలసిన ప్రతి అవసరానికి రూపాకల్పన చేసుకున్నారు.ఇక పై ప్రతి రోజు గ్రామ పర్యటన కార్యక్రమం చెపడతానని 95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు తెలిపారు.
No comments:
Post a Comment