ఘనంగా భగత్ సింగ్ 90వ వర్ధంతి
బెల్లంపల్లి , పెన్ పవర్మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ 90వ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపెల్లి వెంకటస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకట స్వామి మాట్లాడుతూ భగత్ సింగ్ గొప్పదనాన్ని అతని త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిప్ప నరసయ్య జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు దగం మల్లేష్ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం. ఆడెపు రాజమౌళి. బొం గురి రామ్ చందర్. పులిపాక స్వామి దాస్.అక్కపల్లి బాపు. భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు దాసరి బాలయ్య కార్యదర్శి వెల్తురు శంకర్. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment