భగత్ సింగ్ 90వ, వర్ధంతి
తాండూర్, పెన్ పవర్మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం 23/3/2021,భగత్ సింగ్ భవన్ ముందు,భగత్ సింగ్ 90వ, వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ కు పూలమాల వేసి, నివాలర్పించడం జరిగింది. భగత్ సింగ్ 1907 న పంజాబ్ రాష్ట్రంలోని ఖత్కర్ కలాన్గ్రామంలో జన్మించాడు.13ఏళ్ల ప్రాయంలోనే సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రభావితుడయ్యాడు. విప్లవకారులకు వ్యతిరేకంగా తెల్లదొరలు తెచ్చిన ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం నడిపిన వీరుడు యోధుడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం అప్పుడే పుట్టింది. స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత యువకులు కొనసాగించాలని సి పి ఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ కోరారు. ఈ కార్యక్రమంలో సాలిగామ సంతోష్ సీ పి ఐ మండల కోశాధికారి, ఇందారపు రాజేష్ ఎ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి ఎడ్ల గోపాల్ ఎ ఐ వై ఎఫ్ మండల కోశాధికారి కోడి పాక భాస్కర్ కంబాల చందు కంబాలరాజు ఎల్ ధర్మయ్య మేడి పాశం తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment