భగత్ సింగ్ 90 వర్ధంతి సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
పరవాడ,పెన్ పవర్
స్వతత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అయిన భగత్ సింగ్ 90 వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రవేటి కరణ పేరుతో గుజరాతీ యులకు దోచి పెట్టకుండా మనమందరం కలిసి కట్టుగా పోరాడుతూ కాపాడుకుందామని ఆయన అన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బ్రిటిష్ వారిపై పోరాడిన భగత్ సింగ్ గురించి ఆయన వివరింస్తూ భగత్ సింగ్ ఆశయసాధనకు యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని గని శెట్టి పిలుపునిచ్చారు.సినిమా హాల్ జంక్షన్ సబ్ స్టేషన్ ఫార్మాసిటీ లంకెలపాలెం లో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి పి మాణిక్యం,సిఐటియు నాయకులు గేదెల పాపారావు, పి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment