ఘనంగా టాను నాయక్ 71వ వర్ధంతి వేడుకలు...
ఇంద్రవెల్లి, పెన్ పవర్తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటయోధుడు.. జాటోత్ టాను నాయక్ 71వ వర్థంతిని శనివారం మండలంలోని హర్కపూర్ తండా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంజారా యువసేన జిల్లా అధ్యక్షులు రాథోడ్ సంజీవ్ నాయక్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని అన్నారు. బానిసత్వానికి వ్యతిరేకంగా రజాకార్ల చేతిలో అమరుడైన తొలి లంబాడా యోధుడు టాను నాయక్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం నాయకులు రాథోడ్ సంతోష్, ఆడే ప్రేమసింగ్, జాధవ్ ప్రల్లాద్, రాథోడ్ రాజేష్, రాథోడ్ మంగు, ఆడే రమేష్, జాధవ్ గోకుల్, ఆడే బిక్కు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment