Followers

గోకవరం సి హెచ్ సి నందు 70 మంది కి కోవిడ్ టీకాలు...

గోకవరం సి హెచ్ సి  నందు 70 మంది కి కోవిడ్ టీకాలు...



గోకవరం పెన్ పవర్
   గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రం నుందు వైద్యాధికారి డా.ఓ.వి.ఇందిరా ఆధ్వర్యంలో  70 మందికి కోవిడ్ టీకాలు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దశల వారీగా అందరికీ ఆన్లైన్ లో వచ్చిన పేర్లు ఆధారంగా 70 మందికి వేయ డమైనది.  ఈ కార్యక్రమం లో  వైద్య ఆరోగ్యశాఖ నుండి, మరియు అంగన్వాడీ టీచర్స్ టీకాలు తీసుకొన్నారు.ఆసుపత్రి ఆర్థో సర్జన్ డా.ప్రదీప్ సుందర్ టీకా తీసుకొని సంతృప్తి వ్యక్తం  చేశారు. ఈ కార్యక్రమంలో ఈ రోజునుండి సీనియర్ సిటిజన్స్ కు కూడా ఇవ్వబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో. గోకవరం ఎమ్.పి.హెచ్.ఈ.ఓ.వై. యెస్.రాయుడు సూపర్ వైజర్ అశోకవర్ధన్,   మరియు  హెల్త్ అసిస్టెంట్స్ పవన్, రమణ, నవీన్ ఏ.ఎన్.ఎమ్ లు నాగలక్మి, సూర్యకాంతం, ఆశా నూకరత్నం సచివాలయం సిబ్బంది  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...