Followers

మూడు లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత

 మూడు లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత -డిఎస్పి ఎన్.ఎస్ వి వెంకటేశ్వరరావు,

 టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా పట్టివేత, గంజాయి రవాణా చేస్తున్నా ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు

 *గంజాయి రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం, విజయవాడలో గంజాయి సప్లై చేసిన వ్యక్తిపై కేసు నమోదు,

 పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కేసు పూర్వాపరాలు వెల్లడించిన డిఎస్పి

 ఆదిలాబాద్, పెన్ పవర్ 


ఆదిలాబాద్ పట్టణం జాతీయ రహదారి గుండా అక్రమంగా నిషేధిత గంజాయి వాహనాల్లో రవాణా జరుగుతున్న విషయం టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు నెల రోజుల నుండి మాటువేసి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు అదిలాబాద్ గ్రామీణ సిఐ కే పురుషోత్తం చారి, ఎస్సై ఏ. హరిబాబు సిబ్బందితో కలిసి ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్ కంటి గ్రామం నీరా వాటర్ ప్లాంట్ రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎర్టిగా వాహనం KA 38 M 4036 నెంబరు గల  తనిఖీ చేయగా వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన సీట్ల లోపల దాచిన ఒక్కో ప్యాకెట్ రెండు కిలోల బరువు గల 30 ప్యాకెట్లు లభ్యమయ్యాయి, మొత్తం బరువు 60 కేజీల వరకు ఉంటుంది, గంజాయి స్థానిక మార్కెట్ విలువ ప్రకారం 3 లక్షల పైచిలుకు ఉంటుందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో 20 లక్షల పైనే పలుకుతుందని వెల్లడించారు, గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా దడిగి గ్రామానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు..

 A 2- బేలూరే పరమేశ్వర్, (29) 

 A3- పర్సన్నే బల్వంత్ (32) అని వెల్లడిస్తూ.. విజయవాడలో ప్రసాద్ అనే వ్యక్తి అందజేసిన 60 కేజీల గంజాయి ప్యాకెట్లను వాహనంలో నింపుకొని ఆదిలాబాద్ కు చెందిన ఉస్మాన్ ఖాన్ అనే వ్యక్తికి అందజేయాలని సూచించిగా వాహనంలో గంజాయితో బయలుదేరినట్లు నిందితులు వెల్లడించారు, ఈ క్రమంలో గంజాయి లోడు వచ్చిందని స్థానిక మహాలక్ష్మివాడ కు చెందిన ఉస్మాన్ ఖాన్ తన ద్విచక్ర వాహనంలో ఘటన స్థలంకు చేరుకోగా అతన్ని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టుబడిన గంజాయి కేసు స్థానిక అదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, విజయవాడకు చెందిన గంజాయి వ్యాపారి ప్రసాద్ పైన కేసు నమోదైనట్లు వెల్లడించారు, త్వరలో ప్రత్యేక బృందాన్ని విజయవాడ కు చెందిన A 4 ప్రసాద్ నిందితున్ని అరెస్టు చేస్తామని తెలిపారు, ముగ్గురు నిందితుల్లో A 1 అదిలాబాద్ మహాలక్ష్మివాడ కు చెందిన ఉస్మాన్ ఖాన్ (44)  గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నాడని తెలిపారు, అతనిపై 2005 సంవత్సరం నుండి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ నమోదయి ఉన్నట్లు తెలిపారు, అరెస్టయిన ముగ్గురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న 60 కేజీల గంజాయి, ఎర్టిగా, ద్విచక్ర వాహనం, న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు, టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా అందిన సమాచారం మేరకే గంజాయి వాహనం నువ్వు పట్టుకున్నట్లు వెల్లడించారు, ఈ కార్యక్రమంలో అదిలాబాద్ గ్రామీణ సిఐ కే. పురుషోత్తం చారి, ఎస్సై ఏ. హరిబాబు, ఆదిలాబాద్ శిక్షణ మహిళా ఎస్సై బాల్తా స్నేహ, మావాల శిక్షణ మహిళా ఎస్సై కుడికల శ్రవంతి, టాస్క్ ఫోర్స్ ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, కానిస్టేబుల్ సయ్యద్ రాహత్, అదిలాబాద్ గ్రామీణ సిబ్బంది ఎస్ రమణయ్య, మహమ్మద్ జలాలుద్దీన్, స్టేషన్ రైటర్ ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...