5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
పెన్ పవర్,మధురవాడజీవీఎంసీ ఐదోవార్డ్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకె మొదటి ప్రాధాన్యత ఇస్తానని వార్డు టిడిపి అభ్యర్థిని మొల్లి హేమలత స్పష్టంచేశారు. జివిఎంసి ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సోమవారం టిడిపి జిల్లా కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో వార్డ్ పరిధిలోని స్వతంత్రనగర్, నగరంపాలెం, బొట్టవాణిపాలెం,గణేష్ నగర్, అయ్యప్పనగర్, సద్గురుసాయినాథ్ కాలనీ, శివశక్తి నగర్ వైయస్సార్ కాలనీ,సాయిరామ్ కాలనీ, మారికవలస కాలనీ బోరవాణి పాలెం,పరదేశి పాలెం, డ్రైవర్స్ కాలనీ, వికలాంగులకాలనీ తదితర ప్రాంతాలలో విస్తృత పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు.వార్డు పరిధిలో అందరినీ పేరుపేరునా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డుప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం కోసం కృతనిశ్చయంతో ఉన్నామని మొల్లి హేమలత పేర్కొన్నారు. వాటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని నిత్యం వారికి సేవ చేసుకుంటూ ఉంటానని తెలిపారు.
టిడిపి పట్ల ప్రజల్లో మంచి ఆదరణఉందని తప్పకుండా జీవీఎంసీ 5వార్డు పరిధిలో టీడీపీ జెండాను ఎగురవేస్తాముఅని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత సాధించడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని గుర్తించి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే మగవాళ్లతో సమానంగా విద్యా,ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చారని 5వార్డ్ ప్రజలకు హేమలత వివరించారు.స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రతి సభ్యులకు పదివేల రూపాయలు ఇచ్చారని,బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్లు ఇచ్చి ఇంటి వద్ద టైలరింగ్ పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని,ఒంటరి మహిళలకు వికలాంగులకు చేనేత కార్మికులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారని ఆమె గుర్తు చేశారు.ఈ సందర్భంగా జిల్లా టిడిపి కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ టిడిపి హయాంలో విశాఖ అభివృద్ధి చెందిందని అదేవిధంగా వార్డు అభివృద్ధి జరగాలంటే టీడీపీ ని గెలిపించాలని ఆయన ప్రజలకు కోరారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు,వార్డు పరిధిలో తెలుగుదేశం నాయకులు, టిడిపి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment