ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేకే 5 గనిలో ద్వారా సమావేశం
మందమర్రి, పెన్ పవర్మందమర్రి ఏరియా కేకే 5 గని ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో రాజకీయ జోక్యంతో ఆర్థిక దోపిడి జరుపుతున్న గుర్తింపు సంఘం నోరు మెదపకుండా పైరవీలకె పరిమితం అవుతుందని అన్నారు. అలాగే అంతర్గత ఖాళీలను నింపకుండా ఒకే కార్మికులతో ఎన్నో పనులు చేయించుకొని యజమాన్యం శ్రమ దోపిడీ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నూతన 11వ వెజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇకనైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సలేంద్ర సత్యనారాయణ, భీమ నాధుని సుదర్శన్ బొంతు ప్రసాద్, ఫిట్ సెక్రెటరీ గంది శ్రీనివాస్, దేవసాని సాంబయ్య, ఆర్ వెంకన్న, టీ తిరుపతి, కే సమ్మయ్య, ఎస్ కొండయ్య, పి వెంకటస్వామి, జె శ్రీనివాస్, జె మల్లయ్య, మనోహర్, కే రాజ్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment