ఏరియాలో 59 శాతం బొగ్గు ఉత్పత్తి
ఏరియా జిఎం చింతల శ్రీనివాస్
కళ్యాణిఖని,పెన్ పవర్
మందమర్రి ఏరియాలో ఫిబ్రవరి మాసంలో 59 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.ఫిబ్రవరి మాసంలో ఏరియాలోని కేకే-1 గని 100శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 72శాతం,ఆర్కే 1ఎ గని 91శాతం,కాసిపేట గని 52శాతం,కాసిపేట-2 గని 15శాతం,శాంతిఖని గని 48శాతం,కేకే ఓసిపి 114శాతం, ఆర్కే ఓసిపి 21శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.ఫిబ్రవరి నెలలో అండర్ గ్రౌండ్ గనుల ద్వారా 53 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 61 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అధికంగా 2.75 లక్షల టన్నుల నెలవారీ ఉత్పత్తి,11462 టన్నుల రోజువారీ ఉత్పత్తిని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా ఫిబ్రవరి నెలలో 2.04 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా, రైలు మార్గం ద్వారా 48 రేకులకు గాను 1.94 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు,18.17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన వివరించారు.2020-21ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియా వార్షిక లక్ష్యంలో 47శాతం సాధించగా,17.15లక్షల టన్నులు బొగ్గును రవాణా చేసినట్లు, రైలు మార్గం ద్వారా 409 రేకులకు గాను 16.35లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి,205.83లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్,డిజిఎం(ఐఇడి) రాజన్న,డివైపిఎం శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment