Followers

 ఎస్సై మెస్రం చంద్రబాన్ (56) మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్...

ఎస్సై మెస్రం చంద్రభాన్ మృతి చెందడం అదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖకు తీరని లోటు

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పోలీస్ అసోసియేషన్

 ఆదిలాబాద్ ,  పెన్ పవర్ 

ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ యంత్రాంగానికి సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్న మెస్రం చంద్రబాన్ (56) గత 15 రోజుల నుండి ఊపిరితిత్తుల సమస్యలతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ను నియమించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం కోవిడ్ నిర్ధారణ కావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి ఉన్నత స్థాయి వైద్యం అందించాలని కోరారు. సోమవారం సాయంత్రం 7 గంటల 50 నిమిషాల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై రక్తపోటు పెరగడంతో ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మెస్రం చంద్రబాన్ బజార్హత్నూర్ మండలం జాతర్ల గ్రామం ఆయన 1985 సంవత్సరంలో సివిల్ కానిస్టేబుల్ హోదాలో పోలీస్ శాఖ లో చేరారు. 1987 సంవత్సరంలో అల్లంపల్లి  ఘటన మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పుల్లో తీవ్ర గాయాలతో తృటిలో తప్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పదోన్నతి కల్పించి ముఖ్యమంత్రి శౌర్య పథకం అందించారు.2018 సంవత్సరంలో ఎస్సై గా పదోన్నతి పొంది పోలీస్ స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్నారు.ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి గిరిజన ఆదివాసుల సమస్యలను జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తూ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తెచ్చి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేవారు.ఆదివాసీ గిరిజనుల గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా జిల్లా ఎస్పీ కి వెంటనే తెలియజేసి ప్రత్యేక అధికార బృందంతో సందర్శించి పరిష్కరించే బాధ్యత తీసుకునేవారు.జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి కుడిభుజంగా పనిచేస్తూ ఆదివాసుల సమస్యలను అవగతం చేసుకొని ప్రభుత్వానికి వివరించేవారు. ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ఆదివాసులతో సత్సంబంధాలు కొనసాగించేవారు. ఆయన మృతి పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...