50 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్
పెన్ పవర్ ,కందుకూరు
కరోనా వ్యాక్సిన్ వికటించి మరణించిన సింగరాయకొండ మండలం కలిక వాయి గ్రామ అంగన్వాడీ కార్యకర్త సునీత కుటుంబాన్ని ఆదుకోవాలని, 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఉలవపాడు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో కందుకూరు ఆర్టీవో ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో ను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఉలవపాడు ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు వాకా. లతా రెడ్డి మాట్లాడారు.
రాస్తారోకో ను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ సునీతకు జనవరి 20న కరోనా వ్యాక్సిన్ వేశారని, అప్పటి నుండి ఆమె వాంతులతో, జ్వరంతో బాధపడుతున్నారని అనేక హాస్పిటల్స్ లో చికిత్స చేయించినా, లాభం లేకుండా పోయిందని సోమవారం నాడు మరణించిందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వల్లనే చనిపోయిందని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని,50లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు బలవంతపు వ్యాక్సినేషన్ ఆపాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు పద్మజ,.మార్తమ్మ, పీ.వీ శేషమ్మ,.పద్మ, , ప్రసన్న, రమాదేవి, . రాధా, పి. భారతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment