ఘనంగా కింజరాపు అచ్చెన్నాయుడు 49వ జన్మదిన వేడుకలు
భీమిలి, పెన్ పవర్
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ శాసన సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమిలి పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు చేతులమీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టడమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ కింజరాపు కుటుంబం అంటేనే త్యాగానికి, ప్రేమకు చిహ్నమని, అలాంటి కుటుంబం నుండి కింజరాపు ఎర్రంనాయుడు తరువాత అచ్చెన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచుకున్నారని అన్నారు.రాజకీయ రంగప్రవేశం దగ్గరనుండి నేటివరకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా ఓటమి చెందక టెక్కలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని గంటా నూకరాజు కొనియాడిరి.జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితుడిగా,పార్టీకి కట్టుబడి నిలబడే దీటైన వ్యక్తిగా,అధికార పార్టీ వారు ఎంతటి ప్రలోభాలకు,అక్రమాలకు పాల్పడినా ఎక్కడా చెక్కుచెదరకుండా దైర్యంగా నిలబడిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని అన్నారు. దటీజ్ కింజరాపు ఫ్యామిలీ అనే విధంగా ఉన్నారని అన్నారు.ఇంకా అచ్చెన్నాయుడు మరెన్నో పదవులు పొంది,ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని గంటా నూకరాజు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు,పెంటపల్లి యోగీశ్వరరావు,మారోజు సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు,అల్లిపిల్లి వేణు,కాసరపు ఎల్లాజి,కొక్కిరి అప్పన్న,అల్లిపిల్లి సతీష్, రాజగిరి రమణ,వాసుపల్లి వంశీ,సత్తరపు చిన్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment