42 వార్డులో వెంకటేశ్వర స్వామి గుడి కల్యాణంలో పాల్గొన్న కె కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
42 వార్డు రైల్వే న్యూ కొలనీ లో గల రామాలయం వీధి లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి బుధవారం 26వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, ఆళ్ళ లీలావతి శ్రీనివాసరావు, బులుసు జగదీష్ , షేక్ జుబేర్ ,దాడి శ్రీనివాసరావు, లక్ష్మి మరియు దాడి రామకృష్ణ మంగ మరియు పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment