కె.వై.బి. కంపెనీ లిమిటెడ్ జపాన్" కి 41మంది ఆదిత్య విద్యార్థుల ఎంపిక
పెన్ పవర్,గండేపల్లిగండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య నగర్ నందు గల ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల లో ఈరోజు చెన్నై కి చెందిన "కె.వై.బి.కంపెనీ లిమిటెడ్ జపాన్" వారు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూ లలో ఆదిత్య పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యంత ప్రతిభా పాటవాలు కనబరిచి 41మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా. ఎన్. సతీష్ రెడ్డి తెలిపారు. ఆదిత్యపాలిటెక్నిక్ కళాశాల నందు ఇ.సి.ఇ, ఇ.ఇ.ఇ, మరియు మెకానికల్ బ్రాంచ్ లకు చెందిన 41మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులకు నెలకు రూ.13,600/- లు వేతనం లభిస్తుందని డా. సతీష్ రెడ్డి తెలిపారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన శిక్షణ మొదటి రోజునుండి ప్లేస్ మెంట్ కొరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ ఇంతటి విజయానికి కారణమని డా. సతీష్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు సాధించడం కష్టతరమౌతున్న నేటి తరుణంలో పాలిటెక్నిక్ పట్టాతో పాటు మంచి సంస్థలో ఉద్యోగంతో విద్యార్థులు బయటకు వెళ్లడం విద్యార్థి తల్లితండ్రులకు యాజమాన్యానికి ఆనందదాయకం అని ప్రిన్సిపాల్ . ఎస్.టి.వి.ఎస్.కుమార్ అన్నారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను చైర్మన్ డా. ఎన్.శేషారెడ్డి, డైరెక్టర్ డా. ఎం. శ్రీనివాసరెడ్డి,డీన్ ఎ. మాధవరావు, తదితలు అభినందించారు.
No comments:
Post a Comment