Followers

ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

వేములవాడ, పెన్ పవర్

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం వేములవాడ పట్టణంలో తెదేపా శ్రేణులు  ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తెదేపా కరీంనగర్ పార్లమెంటరీ  ఇంచార్జ్ పులి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారకరామారావు పేద ప్రజలకు రెండు పూటలా అన్నం పెట్టాలని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఉద్దేశ్యంతో 1983 లో స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిందని, అనుకున్నట్లుగా గానే పేద ప్రజలకు కడుపునిండా అన్నం పెట్టిన ఘనత, బడుగు బలహీన వర్గాలకు దేవుడు ఎన్ టిఆర్ అని అన్నారు,టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్ తో మన నీళ్లు,నిధులు, నియామకాలు,మీద అధికారం లోకి వచ్చిందని, కానీ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తామని చెప్పి,ఇప్పటి వరకు చేసింది ఏమి లేదని,అన్ని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు ముప్పిడి శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముంజ ఉమెందర్, నందిపేట రమణ యాదవ్, మహమ్మద్ వలీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...