Followers

రేఖపల్లి గ్రామంలోటిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రేఖపల్లి గ్రామంలోటిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 వి.ఆర్.పురం,పెన్ పవర్

  వి.ఆర్.పురం మండలం రేఖపల్లి జంక్షన్ లో మండల టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి  పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు మాజీ  జడ్పిటిసి ముత్యాల రామారావు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం ని నాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహా నాయకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగతమాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం తెలుగు ప్రజల పండగ రోజు అని ఆయన అన్నారు. టిడిపి మండల కార్యదర్శి బురఖా కన్నారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఘనత  ఎన్టీఆర్ దే  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల నుంచి యువతరాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన ఏకైక మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బురక కన్నారావు పాయం రామారావు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ ముత్యాల చంద్రశేఖర్ బుర్రక సారయ్య  బోర్ర దుర్గారావు ముత్యాల  శ్రీనివాస్( స్మాల్ ) ముత్యాల రమేష్ ఉప సర్పంచ్ లక్ష్మణ్  సీతామాలక్ష్మి సవలం రాజు నరేష్ సూర్య ప్రకాశరావు కోట్ల రాజారావు సత్యనారాయణ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...