Followers

ఆంధ్రుల ఆత్మ గౌరవ నినాదంతో ,బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఏర్పాటై 40 ఏళ్లు

ఆంధ్రుల ఆత్మ గౌరవ నినాదంతో ,బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఏర్పాటై 40 ఏళ్లు

విజయనగరం,పెన్ పవర్

 ఆంధ్రుల ఆత్మ గౌరవ నినాదం తో తెలుగుతేజం , క్రే.శే. నందమూరి తారకరామారావు గారు తెలుగు ప్రజల క్షేమం, భాషాభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘40 ఏళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలను, ఒడిదుడుగులను పార్టీ ఎదుర్కొని కార్యకర్తల త్యాగ ఫలంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడపడం జరిగిందని తెలిపారు.. నేడు రాష్ట్రంలో పాలన కుంటుపడిందని. అరాచక, ఆటవిక విధానంలో పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు,రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,  టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవిరళ కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.  పార్టీ అధికారంలో లేనంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదని అన్నారు.  ఎన్టీ రామారావు గారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకున్నారని గీత తెలిపారు.. అందరూ కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు.  ప్రజా అభివృద్ధి కోసం  ధైర్యంతో ముందుకుసాగి తెలుగుదేశాన్ని మళ్లీ విజయం బాటలో నడిపించేందుకు కృషి  చేసి తెలుగుజాతి గౌరవాన్ని నిలబెడదామని గీత  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సైలాడ త్రినాద్ గారు,రవిరాజు గారు, అంబళ్ళ సూర్యప్రకాష్, ఎర్ర ఎర్నాయుడు, రొంగలి రామారావు, జయప్రకాష్,సుంకరి విజయ లక్ష్మి, సుంకరి శ్రీను,రవి, కెల్ల సూరిబాబుగారు,సారిక చిన్న, సత్యనారాయణ, గుప్తా గారు, గేదెల సతీష్, చందక సూరప్పడు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...