Followers

తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పెన్ పవర్,ఆలమూరు 

 తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం నినాదంతో బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచిన మ‌హానాయ‌కుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత ముఖ్యమంత్రి  నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్స‌వం  జ‌రుపుకోవ‌డం చాలా సంతోషంమని తెలుగు ప్రజల పండగరోజని ఆలమూరు మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి (నల్లబాబు), మాజీ పీఏసీఎస్ చైర్మన్ వంటిపల్లి సతీష్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మండల కేంద్రమైన ఆలమూరు బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పార్టీ ఆరంభించిన నెల‌ల కాలంలోనే అధికారంలోకొచ్చి  పేద‌ల‌కు కూడు, గూడు, గుడ్డ అందించే ప‌థ‌కాలు ఆరంభించారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల నుంచి యువ‌త‌రాన్ని రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం చేసిన ఏకైక మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా చెక్కుచెద‌ర‌ని ప్ర‌జాభిమానంతో కొన‌సాగుతోన్న తెలుగుదేశం పార్టీకి బ‌లం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులేనని, తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు ప్రజల కుటుంబ‌స‌భ్యులంద‌రికీ పేరుపేరునా శుభాకాంక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో రామానుజులు శేషయ్య, కడియాల శ్రీనివాస్, అనసూరి నాగరత్నం,  గన్ని వెంకన్నబాబు ,నెక్కంటి ప్రసాద్ ,సత్తిబాబు,పలువురు  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...