విజయనగరం 4ఎస్ కళాశాల అక్రమాలపై అధికారులు విచారణ జరపాలి - ఎస్ఎఫ్ఐ
విజయనగరం,పెన్ పవర్ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న ఎస్ఎస్ఎస్ఎస్ కాలేజీలో ఉన్న సమస్యలపై,అక్రమాలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్సులు వెంకటేష్,రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన ఫీజులు 4ఎస్ కాలేజీలో అమలు జరపకుండా విద్యార్థులు దగ్గర ఎక్కువ మోతాదులో ఫీజులు వసూలు చేస్తున్నారని,ప్రభుత్వం కేటాయించిన సి - గ్రేడ్ ప్రకారం ఫీజులు తీసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం నచ్చినట్టు విద్యార్థుల నుంచి వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని,అడ్మిషన్ అయ్యే ముందు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసారని, వెంటనే అక్రమంగా తీసుకున్న డబ్బులను విద్యార్థులకు వాపస్ ఇవ్వాలని,లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ సంఘటన పై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాము,డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఎ. మణికంఠ,ఎస్ఎఫ్ఐ నాయకులు సతీష్, అరవింద్,హర్ష,రవి,జగదీష్, మిత్తిరెడ్డి.చంద్రశేఖర్,వెంకట రమణ పాల్గొన్నారు.
No comments:
Post a Comment