Followers

3వ వార్డులో పలు సమస్యలపై జెడ్.సి కి వినతిపత్రాన్ని సమర్పించిన గంటా నూకరాజు

 3వ వార్డులో పలు సమస్యలపై జెడ్.సి కి వినతిపత్రాన్ని సమర్పించిన గంటా నూకరాజు

భీమిలి, పెన్ పవర్

భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న పలు సమస్యలపై  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆధ్వర్యంలో  మంగళవారం భీమిలి జోనల్ కమీషనర్  సి.హెచ్. గోవిందరావుకి వినతిపత్రం ఇవ్వడమైనది.తెలుగుదేశం పార్టీ  అధికారంలో ఉండేటప్పుడు భీమిలి జోన్ లో బోయవీధి,ఎగువపేట,తోటవీధి,నేరళ్ళవలస కోలనీ, గొల్లలపాలెం,క్రిష్ణా కోలనీ,రెళ్లివీధిలో  7 సామాజిక భవనాలు నిర్మించారని గంటా నూకరాజు అన్నారు.  సామాజిక భవనాలు నిర్మించేటప్పుడే  పూర్తయిన తరువాత ఆయా గ్రామాలకు వాటి నిర్వహణ బాధ్యత అప్పగించి, పూర్తిగా  ఆ గ్రామ  ఆధీనంలో ఉండేవిధంగా చేస్తామని అప్పటి ప్రభుత్వం తరపున అధికారులు మాట ఇచ్చారని  కానీ ఆ 7 సామాజిక భవనాలపై అధికారులు మాట తప్పారని, వెంటనే వాటిని ఆ గ్రామస్టులకు పెద్దల సమక్షంలో  అప్పజెప్పాలని జోనల్ కమీషనర్ కి ఇచ్చిన వినతిపత్రంలో కోరామని  గంటా నూకరాజు అన్నారు. కొన్ని సామాజిక భవనాలలో సచివాలయమని,  మరి  కొన్నింటిని  వృధాగా ఉంచారని అన్నారు.దయచేసి ఈ 7 సామాజిక భవనాలను ఆయా గ్రామాల అవసరాల కోసం ఇవ్వాలసిందిగా  కోరామని చెప్పారు.అదేవిధంగా  జలగెడ్డ శ్మశానవాటిక,గాడువీది శ్మశానవాటిక,  జెడ్.పి.గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న  చెరువుగట్టు దగ్గర విపరీతంగా తుప్పలు మొలిసాయని,శ్మశానవాటికలో అయితే అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లినవారికి సరైన మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు.  ఇక్కడ తుప్పలు తొలగించాలని కోరారు.అదేవిధంగా  మహాత్మాగాంధీ పాఠశాలలో  అంగన్వాడీ కేంద్రం నడుపుతున్నారు.విద్యార్థులు ఎక్కువగా ఉండటం,   వీరికి మంచినీరు గాని, కరెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించాలని గంటా నూకరాజు ఇచ్చిన వినతిపత్రంలో కొరడమైనది.భీమిలి - దొరతోట రోడ్డుకు ఆనుకొని గొల్లలపాలెం పాఠశాల మరియు రెల్లివీధి పాఠశాలలు ఉన్నాయి.ఇక్కడ తరచు ప్రమాదాలు జరుగుతుండటం విద్యార్థులను,వారి తల్లిదండ్రులను మరియు  స్థానికులను కలవర పడుతుంది.  అందువలన పాఠశాలకు దగ్గరలో రెండువైపులా  వాహనాల వేగ నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా స్పీడ్ బ్రేకర్లు వెయ్యవలసినదిగా కోరడమైనది.గుప్తా వీధి,గొల్లలపాలెంలో కాలువలు పూర్తిగా చెత్తతో నిండి ఉండటం వలన మురుగునీరు నిల్వ ఉంటుంది.  దీనివలన దోమలు ఎక్కువగా నిల్వ ఉండటమే కాకుండా,దుర్వాసన  స్థానికులను కలవర పడుతుంది.పైన సూచించునటువంటి సమస్యలను పరిష్కరించాలని జోనల్ కమీషనర్ కి ఇచ్చిన వినతిపత్రంలో గంటా నూకరాజు కోరడమైనది.ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంటపల్లి యోగీశ్వరరావు, మారోజు  సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు,జలగడుగుల మురళి, కంచెర్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...